'గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి'
ADB: గర్భిణీ మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని గర్భకోశ నిపుణురాలు డా. కౌస్తుభ విజయసారథి సూచించారు. ఆదివారం భీంపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. నిఖిల్ రాజ్, వైద్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ ఉన్నారు.