శివంపేటలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
MDK: శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం కార్తీకమాసం పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.