ఉత్తమ ఉపాధ్యాయుడిని సన్మానించిన మంత్రి, ఎమ్మెల్సీ
E.G: గోకవరం మండలం రంప యెర్రంపాలెం జడ్‌పీహెచ్ఎస్ హైస్కూల్లో ఉపాధ్యాడుగా విధులు నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి రాజు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, శాసనమండలి ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.