సీఐ అశోక్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
కడప: జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆయనను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూమి సెటిల్‌మెంట్లు, ఇతర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఆధారాలు లభ్యమవ్వడంతో సీఐ అశోక్‌రెడ్డిని సస్పెన్షన్ చేసినట్లు డీఐజీ తెలిపారు.