'ఇంద్ర పుష్కరిణి' కొత్త నమూనా ఇదే..!
SKLM: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇంద్ర పుష్కరిణి నమూనా చిత్రాన్ని శనివారం అధికారులు విడుదల చేశారు. ఇంద్ర పుష్కరిణి అభివృద్ధికి ప్రసాద్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రూ.4 కోట్లతో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం పుష్కరిణి అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్, అచ్చెన్నాయుడులు శంకుస్థాపన చేశారు.