VIDEO: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
NZB: బాల్కొండ మండలం కిసాన్ నగర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యాలకు గురై ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన ముగ్గురికి చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేని నగేష్, కపిల్, రాజలింగం, పురుషోత్తం, రమేష్, పాల్గొన్నారు.