సోషల్ మీడియా ఆఫర్‌ను నమ్మొద్దు

సోషల్ మీడియా ఆఫర్‌ను నమ్మొద్దు

KMM: సోషల్ మీడియా లేదా వ్యక్తిగత మెసేజ్‌ల ద్వారా వచ్చిన ఐపీవో ఆఫర్‌లను నమ్మవద్దని ఖమ్మం సీపీ సునీల్, దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసగాళ్లు నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు, వెబ్ సైట్లు రూపొందించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెబుతూ ఆకర్షించి మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.