రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్
E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రేపు(సోమవారం) యధావిధిగా 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ప్రజల అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం ఈ వేదిక ఉద్దేశ్యం అన్నారు. అర్జీదారులు ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.