పెనుకొండ డివిజన్‌లో గ్యాస్ కొరత లేదు: ఆర్డీవో

పెనుకొండ డివిజన్‌లో గ్యాస్ కొరత లేదు: ఆర్డీవో

SS: పెనుకొండ డివిజన్‌‌లో గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని ఆర్డీవో ఆనంద్ కుమార్ తెలిపారు. కొంతమంది వినియోగదారులు గ్యాస్‌ కొరత వస్తుందనే అపోహతో అధికంగా బుకింగ్‌ చేసుకోవడం వల్ల సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్యాస్‌ సరఫరాలో ఎలాంటి లోపం లేదని ఆయన స్పష్టం చేశారు. గ్యాస్‌ సమస్యలపై 7207465274 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.