తెనాలిలో ఆర్టీసీ బస్సుల కోసం మహిళల పడిగాపులు
GNTR: స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులకు మహిళల తాకిడి పెరిగింది. తెనాలిలో రద్దీకి తగినట్లుగా సర్వీసులు లేకపోవడంతో మహిళలు రోడ్లపై గురువారం పడిగాపులు కాస్తున్నారు. తెనాలి - గుంటూరు మార్గంలో ఈ సమస్య మరింతగా ఉందని చెబుతున్నారు. బస్సుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కొన్ని కనీసం ఆపకుండా వెళ్తుతున్నాయన్నారు.