ఢిల్లీకి వెళ్లిన మేయర్, కమిషనర్

GNTR: గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీ అవార్డును జీఎంసీకి ప్రకటించింది. ఈ నెల 17న మేయర్, కమిషనర్ ఢిల్లీలో అవార్డు అందుకోనున్నారు. ఈ మేరకు వారు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. 18న కమిషనర్ తిరిగి విధుల్లో చేరనున్నారు.