విశాఖ-చెర్లపల్లికి స్పెషల్ రైలు

విశాఖ-చెర్లపల్లికి స్పెషల్ రైలు

VSP: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాల్తేరు డివిజన్ విశాఖ- చెర్లపల్లి మధ్య ప్రత్యేక రైలును (ట్రైన్ నెం. 08541/08542) ఆదివారం ప్రకటించింది. ఈ రైలు ఈ నెల 21న సాయంత్రం 17:30 గంటలకు విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చెర్లపల్లి చేరుకుంటుంది. ఈ నెల 22న మధ్యాహ్నం 15:30 గంటలకు చెర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు విశాఖ చేరుకుంటుంది.