'ప్రకృతి సేద్యంతో మేలైన ఉత్పత్తులు'

W.G: ప్రకృతి విధానంలో సాగు చేయడం ద్వారా రైతులు మేలైన ఉత్పత్తులు సాధించవచ్చు అని జోనల్ కోఆర్డినేటర్ గద్దె వెంకటరత్నాజీ సూచించారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో గురువారం ప్రకృతి సేద్యం రైతు క్షేత్రంలో ఆయన డ్రోన్ పిచికారి విధానం గురించి వివరించారు. రసాయన ఎరువులు తగ్గించి స్వయంగా తయారుచేసుకున్న కషాయాలు వినియోగించుకోవాలన్నారు.