డ్రోన్‌కి చిక్కిన మందుబాబులు

కృష్ణా: పెదపారుపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం డ్రోన్ కెమెరా ద్వారా బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మ అపార్ట్మెంట్ వద్ద నలుగురు, పులవర్తిగూడెం వద్ద ముగ్గురుని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.