సర్పంచ్‌లను సత్కరించిన జడ్పీ ఛైర్మన్

సర్పంచ్‌లను సత్కరించిన జడ్పీ ఛైర్మన్

VZM: బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్‌లను శుక్రవారం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచుల సేవలను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమన్నారు. అలాగే, విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవ చేసిన తీరు ప్రశంసనీయమన్నారు.