నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామని కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం తెలిపారు. ప్రజలు అర్జీలను ప్రత్యక్షంగా లేదా meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని, పరిష్కార స్థితిని వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్ని ఆమె వెల్లడించారు.