12వ బెటాలియన్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

12వ బెటాలియన్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

NLG: అన్నెపర్తిలోని 12వ బెటాలియన్లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ కమాండెంట్ కే.వీ. రవిచంద్ర బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.