హైస్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

NLG: విద్యార్థిదశ నుండే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు చెప్పారు. ఇవాళ ఆమె నిడమనూరు మండలం, ముకుందాపురం జడ్పీహైస్కూల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో వివిధ అంశాలపై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని వృద్ధిలోకి రావాలని సూచించారు.