క్వాక్ ఏరినా పబ్‌లో ఈగల్ టీమ్ సోదాలు
హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. కొండాపూర్‌లోని క్వాక్ ఏరినా పబ్‌లో ఈగల్ టీమ్ సోదాలు జరుపగా డ్రగ్స్ తీసుకుంటున్న కొంతమంది యువకులను పట్టుకున్నారు. వారికి డ్రగ్స్ పరీక్షలు చేయగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.