నేనేమైనా పాకిస్థాన్‌ నుంచి వచ్చానా.. నా పత్తి ఎందుకు కొనట్లేదు?

నేనేమైనా పాకిస్థాన్‌ నుంచి వచ్చానా.. నా పత్తి ఎందుకు కొనట్లేదు?

BHNG: వలిగొండ మండలం రెడ్ల రేపాకకు చెందిన రైతు జహంగీర్‌ తన పత్తి పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్‌ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని ఆవేదన చెందాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.