72 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు
కడప జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రైవేట్ బస్సుల తనిఖీల్లో ఇప్పటి వరకు 72 కేసులు నమోదు చేసినట్లు ఇన్ ఛార్జ్ డీటీసీ వీర్రాజు శుక్రవారం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మూడు బస్సులను జప్తు చేయగా, 20 వాహనాల్లో సీటింగ్ విధానం లేదని గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.