న్యూరోసర్జరీ పరిశోధనకు గుర్తింపు
VZM: ప్రభుత్వ వైద్య కళాశాల న్యూరోసర్జరీ విభాగానికి చెందిన డా. రెడ్డి శంకరరావు, MBBS విద్యార్థి డానీ సంయుక్తంగా చేసిన పరిశోధనకు జిటామ్ ఫౌండర్స్ సమ్మిట్‌లో గుర్తింపు లభించింది. వినూత్న పరికరం పై చేసిన ఈ పరిశోధనకు ఓవరాల్ రన్నర్-అప్ అవార్డు, రూ.35 వేల నగదు బహుమతి అందింది. వారిని ప్రిన్సిపాల్ దేవి మాధవి, సూపరింటెండెంట్ పద్మజ మంగళవారం అభినందించారు.