జాతీయస్థాయి పోటీలకు బధిరుల ఎంపిక.. ఎమ్మెల్యే హర్షం
WG: హర్యానాలో ఏప్రియల్ 9 నుంచి 25వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి బధిరుల (మూగ చెముడు) క్రికెట్ పోటీలకు 16 మంది ఎంపిక కావడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జిల్లా అసోసియేషన్ నుంచి ఎంపికైన బధిర క్రీడాకారులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబు ఆదివారం అభినందించారు.