GOOD NEWS: నేడు అకౌంట్లోకి డబ్బులు

GOOD NEWS: నేడు అకౌంట్లోకి డబ్బులు

AP: అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. అర్హులైన దాదాపు 46.86 లక్షల మంది రైతుల కోసం ప్రభుత్వం మొత్తం రూ. 3,135 కోట్ల నిధులను విడుదల చేయనుంది. ఒక్కొక్క రైతుకు రూ. 7,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మొత్తంలో PM కిసాన్ సమ్మాన్ నిధులు రూ. 2,000 ఉండగా, రాష్ట్రం అందించే అన్నదాత సుఖీభవ నిధులు రూ. 5,000 ఉన్నాయి.