హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఏఎస్ఐ
కృష్ణా: ట్రాఫిక్ ఎస్ఐ ఏ. బాలాజీ మచిలీపట్నం లోని జాతీయ రహదారి-216లోని హర్ష కాలేజ్ సమీపంలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్‌ను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని ఆపి, వారికి మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ISI మార్క్ కలిగిన హెల్మెట్‌ను ధరించాలని సూచించారు.