పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ
MDK: చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. మండలంలోని కేసుల నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. PS పరిధిలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఎస్సై నారాయణ గౌడ్‌కు ఆయన సూచించారు.