కార్పొరేషన్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ నిరసన

కార్పొరేషన్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ నిరసన

KDP: కడప నగరంలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గతంలో పలుమార్లు అర్జీలు ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంలో మున్సిపల్ కమిషనర్ తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపిస్తూ శవపాడెతో నిరసన వ్యక్తం చేశారు.