వల్లభనేని వంశీ‌కి గుడ్ న్యూస్

వల్లభనేని వంశీ‌కి గుడ్ న్యూస్

కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో విధించిన బెయిల్ షరతుల్లో SC, ST కోర్టు కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రతి శనివారం పటమట స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉండగా, ఇకపై ప్రతి నెలలో 2, 4వ శనివారాలలో సంతకం చేయాలని కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఆరోగ్య సమస్యల కారణంగా వంశీ పెట్టిన పిటిషన్‌పై ఈ తీర్పు వచ్చింది.