రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్: మైనంపల్లి

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్: మైనంపల్లి

MDK: రాష్ట్రాన్ని దోచుకున్న BRS నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ప్రతి వ్యక్తిపై లక్షల రూపాయల అప్పు చేశారని మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. నిజాంపేట(M) కల్వకుంట గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ, అభివృద్దికి చేస్తుందని అన్నారు.