మంత్రి లోకేష్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు
ATP: T20WC ఫైనల్స్‌లో టీమిండియా ఆటగాళ్లను ప్రోత్సహించిన మంత్రి నారా లోకేష్‌ను తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై మన జట్టుకు మద్దతు తెలపడం క్రీడా స్ఫూర్తికి, దేశభక్తికి నిదర్శనమని అన్నారు. నాయకులు క్రీడలను ప్రోత్సహించడం వల్ల యువతలో స్ఫూర్తి నిండటంతో పాటు జాతీయ గౌరవం పెరుగుతుందని కొనియాడారు.