గుంటూరులో పాలిసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

GNTR: పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరగనున్న పాలిసెట్-2025 పరీక్షకు గుంటూరు జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 4,030 మంది విద్యార్థుల కోసం నగరంలో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు కనీసం గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.