పొంగూరు వద్ద అదుపుతప్పి కారు బోల్తా

NLR: మర్రిపాడు మండలం, పొంగూరు సమీపంలో చెరువు కట్ట వద్ద మలుపు వద్ద బుధవారం ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు నుంచి గౌరవరం వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.