వారంలో 50వేల మెట్రిక్ టన్నుల యూరియా: MP

MDK: రైతులు ఆందోళన చెందవద్దని, వారంలోపు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెస్తామని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాల మేరకు ఇప్పటికే యూరియాను కేంద్రం పంపించిందని, కృత్రిమ కొరతతోనే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే యూరియా ఆపరేషన్ సిందూర్ వల్ల సకాలంలో రాకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు.