ఏపీ రాజకీయాల్లోకి బొత్స వారసురాలు ఎంట్రీ?
AP: రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అందరికీ సుపరిచితమే. అయితే, బొత్స వారసురాలు అనూష పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్ వర్క్ గట్టిగానే జరుగుతోందట. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా కనిపించారు. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని పరిశీలకులు అంటున్నారు.