గ్రామాల్లో బెల్ట్ షాపులపై ప్రత్యేక తనిఖీలు
MDK: శివంపేట మండల వ్యాప్తంగా ఎఫ్ఎస్టీ బృందం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా చర్యలు చేపట్టారు. పలు షాపుల్లో మద్యం విక్రయాలు జరగకుండా తనిఖీలు చేపట్టారు.