ఆర్జేడీ భవితవ్యంపై లాలూ కీలక ప్రకటన
ఆర్జేడీ భవితవ్యంపై ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఆర్జేడీని తేజస్వీ యాదవ్ ముందు ఉండి నడిపిస్తారని ప్రకటించారు. తేజస్వీ అడుగు జాడల్లోనే కార్యకర్తలు నడవాలని పిలుపునిచ్చారు. ఓటమి తర్వాత లాలూ కుటుంబంలో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.