ఘనంగా భోగి పండగ సంబరాలు

RR: మూడు రోజుల సంక్రాంతి పండగకు అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పెద్దఅంబర్ పేట గ్రామం ముస్తాబైంది. తొలి రోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు వేకువజాము నుంచే వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. భోగిమంటలతో ప్రజలు పండుగకు ఆహ్వానం పలికారు. మరోవైపు చిన్నారులు పతంగులు ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.