రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

GDWL: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ మిల్లుల యజమానులు చేపట్టిన సమ్మె ముగిసినట్లు అలంపూర్ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ఎల్లస్వామి తెలిపారు. ఉండవెల్లి మండల పరిధిలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోళ్లు రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతాయన్నారు. సమ్మె కాలంలో ఉన్నవారు మరో స్లాట్బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.