చిలకలూరిపేట లాడ్జిల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

PLD: చిలకలూరిపేట పట్టణంలోని పలు లాడ్జిల్లో పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్బన్ సీఐ రమేష్ సూచనలతో ఎస్సై చెన్నకేశవులు ఈ తనిఖీలను చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామన్నారు.