'వడ్ల కల్లాలు ఏర్పాటు చేయాలి'
MLG: ఏటూరునాగారం మండలం శాపల్లి గ్రామంలో కల్లాలు సరిపోకపోవడంతో రైతులు నడిరోడ్డు పైనే వరి వడ్లు ఆరబోస్తున్నారు. చిన్న కల్లాలు, ఆరబెట్టే స్థలం లేకపోవడంతో రోడ్డును ఆక్రమిస్తున్నారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల భయం కలుగుతోంది. అధికారులు స్పందించి తగిన కల్లాలు ఏర్పాటు చేయాలని రైతులు ఇవాళ డిమాండ్ చేశారు.