BREAKING: దిగ్గజ నటుడు కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ధర్మేంద్రను 2012లో పద్మభూషణ్ పురస్కారం వరించింది. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. బాలీవుడ్ నటులు సన్నీడియోల్, బాబీడియోల్ ఆయన కుమారులు.