VIDEO: ఎస్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఎస్టీఓ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి బిల్లులు ప్రాసెస్ చేయడానికి కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ లంచం అడిగాడు. సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను సంప్రదించగా ఫోన్ పే ద్వారా రూ.5 వేలు ఇవ్వడం జరిగినట్లు తేలింది. దీంతో ఏసీబీ అధికారులు ఉద్యోగిని అరెస్టు చేశారు.