ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం

తిరుమలగిరి: ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సోమనర్సయ్య బుధవారం తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీద వైశ్య విద్యార్థులను, కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.