గోదాము తనిఖీ చేసిన కలెక్టర్

NRPT: నారాయణపేటలోని సింగిల్ విండో గోదాంను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా బస్తాల నిల్వను పరిశీలించారు. ఇంతవరకు ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించారని అధికారులను ప్రశ్నించగా, 54 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతుల వివరాలు, ఆధార్ కార్డు నంబర్ నమోదు చేసుకొని విక్రయించామని సంబంధిత అధికారులు చెప్పారు.