ఎర్రగుంట్లలో పొలాల్లో అగ్నిప్రమాదం

ఎర్రగుంట్లలో పొలాల్లో అగ్నిప్రమాదం

KDP: ఎర్రగుంట్లలో జువారి సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాల్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థులు కలిసి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయగా, అధికారులు సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఎండల తీవ్రత, పొడి గడ్డి కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తమవుతోందన్నారు.