కదిరి 'లక్ష్మీనరసింహ స్వామి' చరిత్ర

కదిరి 'లక్ష్మీనరసింహ స్వామి' చరిత్ర

ATP: కదిరిలో లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కృతయుగంలో హిరణ్యకశిపుడిని సంహరించి, స్వామి ఉగ్రరూపంతో లోకాలను దహిస్తుండగా, ప్రహ్లాదుడు, దేవతలు స్వామిని శాంతింపమని కోరారు. అప్పుడు స్వామి ఇక్కడి ఖదీర వృక్షం తొర్రలో వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. 'ఖదీర' అంటే చండ్ర చెట్టు అని అర్థం. ఇక్కడ స్వామి ఆవిర్భవించినందున ఈ ప్రాంతానికి కదిరి అనే పేరు వచ్చింది.