'బిడ్డ మృతికి ఎస్ఐ, సీఐలే కారణం'

'బిడ్డ మృతికి ఎస్ఐ, సీఐలే కారణం'

SRPT: కర్ల రాజేష్ మరణానికి స్థానిక ఎస్ఐ, సీఐలే కారణమని అతని తల్లి లలితమ్మ సూర్యాపేట ఎస్పీ నరసింహకి ఫిర్యాదు చేసింది. చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. నవంబర్ 4 నుంచి 9 వరకు ఎలాంటి కేసు లేకుండా కస్టడీలో ఉంచి తీవ్రంగా హింసించారని తెలిపింది. రెండు సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటూ ఎస్పీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.