గుంటూరు రైల్వేస్టేషన్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

గుంటూరు రైల్వేస్టేషన్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

GNTR: గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు గుంటూరు రైల్వే స్టేషన్లో సోమవారం రాత్రి కొత్తపేట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ వీరయ్య నేతృత్వంలో పోలీసులు ప్లాట్ఫారాలు, రైళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రయాణికుల బ్యాగులను పరిశీలించి, కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు.