స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ఆర్డీవో ఆఫీస్ వద్ద ధర్నా

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని మంగళవారం ఆర్డీవో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.