రేపు మెగా జాబ్ మేళా
BHPL: జిల్లా కేంద్రంలో ఈ నెల 25వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి అరూరి శ్యామల తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన 18-30 సంవత్సరాల యువకులు విద్య అర్హత సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలలోపు జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9701078288 నంబర్‌ను సంప్రదించాలని శ్యామల సూచించారు.